Balasubramaniam biography in telugu
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
|---|---|
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | |
| జననం | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946-06-04)1946 జూన్ 4 కోనేటమ్మపేట, నెల్లూరు జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ |
| మరణం | 2020 సెప్టెంబరు 25(2020-09-25) (వయసు 74) ఎంజిఎం హాస్పిటల్, చెన్నై |
| మరణ కారణం | కోవిడ్ 19 |
| ఇతర పేర్లు | బాలు, గాన గంధర్వుడు |
| వృత్తి | నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు |
| క్రియాశీల సంవత్సరాలు | 1965 - 2020 |
| జీవిత భాగస్వామి | సావిత్రి |
| పిల్లలు | చరణ్ & పల్లవి |
| తల్లిదండ్రులు |
|
| వెబ్‌సైటు | http://www.spbindia.com |
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర